Corona భయంతోనే ప్రాణాలు పోతున్నాయ్‌..
close

తాజా వార్తలు

Published : 02/05/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona భయంతోనే ప్రాణాలు పోతున్నాయ్‌..

ఖమ్మం: కరోనా సోకి అనారోగ్యం క్షీణించి ప్రాణాలు పోవడమే కాదు. కరోనా భయమూ ప్రాణాలు తీస్తోంది. నిజామాబాద్‌లోని రెంజల్‌ ఘటన మరువకముందే ఖమ్మం జిల్లాలోనూ అదే తరహా ఘటనలు వెలుగుచూడటం విషాదకరం. మహబూబాబాద్‌కు చెందిన ఆనందాచారి కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం రాగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. పాత బస్టాండ్‌లోని పరీక్షా కేంద్రానికి వెళ్లి వేచిచూస్తూ అక్కడే మృతిచెందాడు.

తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ పరీక్షలకు వచ్చి పాజిటివ్‌గా తేలడంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. బిల్లుపాడుకు చెందిన ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ కరోనా పరీక్ష కోసం ఉదయాన్నే తల్లాడ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్ష అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు.

కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో విషాదం చోటుచేసుకుంది. బోర్గాం గ్రామానికి చెందిన అశోక్‌ (30) తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు అతడిని రెంజల్‌ ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు చేయించారు. ఫలితం వచ్చేందుకు సమయం పడుతుందని సిబ్బంది చెప్పడంతో అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. అయితే కొద్దిసేపటికి ఆ చెట్టు కిందే అశోక్ ప్రాణాలు వదిలాడు. మరికాసేపటికి ఫలితం రాగా అందులో నెగెటివ్‌గా తేలింది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని