close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119057778 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Hm411jSW7M0 [video_short_link] => Hm411jSW7M0 [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2019-12-14 12:47:37.053955 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం

విజయవాడ శివారులోని ఓ వసతిగృహంలో దారుణ హత్యకు గురైన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తున్నారు. అయేషా మీరా మృతదేహం అవశేషాలను కూలీలు బయటకు తీశారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్‌ బృందం నివేదికను తయారు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్‌

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రైతు, నిరుద్యోగ సమస్యలపై పోరాడేందుకే ‘భారత్‌ బచావ్‌’ ర్యాలీ చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 4 వేల మంది నేతలు, కార్యకర్తలు దిల్లీకి వచ్చారన్నారు. విభజించి పాలించు తరహాలో వ్యవస్థలను ప్రధాని మోదీ నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారని,సీఎం కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు శ్రీమంతులయ్యారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు:కనకమేడల

ప్రత్యేక హోదాను వైకాపా పక్కన పెట్టిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో వైకాపా ఎంపీలు రాష్ట్ర సమస్యలు లేవనెత్తలేదని అన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. చీకట్లో చూచి రాతలు

పర్యవేక్షణ లేమితో నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షలు గాడి తప్పాయి. హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట సక్సెస్‌ క్రియేటివ్‌ పాఠశాలలో ఏకంగా ఈరోజు జరగనున్న పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా నిర్వహిస్తూ అడ్డంగా దొరికారు. నిబంధనల ప్రకారం  మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా చీకట్లో చూచిరాతలు యథేచ్ఛగా జరగడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కేజ్రీవాల్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ బృందం

సామాన్యుడిగా వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొద్ది నెలల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్‌(ఇండియన్‌ ప్యాక్‌)తో కేజ్రీ చేతులు కలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 2022 నాటికి పార్లమెంట్‌ నూతన భవనం

మరో రెండేళ్లలో అంటే 2022 నాటికి నూతన పార్లమెంట్‌ భవనం అందుబాటులోకి రానుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే సమయానికి కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత భవనం కోసం ప్రభుత్వం రెండు, మూడు ప్రాంతాలు పరిశీలిస్తోందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. దేశ ఆర్థిక వ్యవస్థను ఐసీయూలో పెట్టారు

భాజపా ప్రభుత్వం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘భారత్‌ బచావో’ పేరిట శనివారం దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున్న ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి కొద్ది సేపటి ముందు రాహుల్‌ భాజపాను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ బచావో(సేవ్‌ ఇండియా) ర్యాలీలో భాజపా అరాచక పరిపాలన గురించి నేను మాట్లాడనున్నాను. భాజపా దేశ ఆర్థిక వ్యవస్థను ఐసీయూలో చేర్చింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విదేశీ పర్యాటకులను తాకిన ‘పౌరసత్వ’ సెగ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన హింసాత్మక ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకుతున్నాయి. ఇప్పటికే దిల్లీ, బెంగాల్‌లోనూ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఆందోళనల నేపథ్యంలో భారత్‌కు వచ్చే తమ పౌరులకు తాజాగా ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేశాయి అమెరికా, బ్రిటన్‌ దేశాలు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్త వహించాలని సూచించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భువీ స్థానంలో శార్దుల్‌కు చోటు

వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ జట్టులో చోటు సాధించినట్లు శనివారం బీసీసీఐ వెల్లడించింది. తొలి మ్యాచ్‌ ఆదివారం చెన్నై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రామోజీఫిల్మ్‌ సిటీలో అట్టహాసంగా ‘వింటర్‌ ఫెస్ట్‌’



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.