close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119062981 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => SPRf2m24r6I [video_short_link] => SPRf2m24r6I [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2019-12-24 13:01:45.116907 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. ఉన్నత విద్యప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మే 2న ఈసెట్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మే 5, 6, 7 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్, మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌ నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కిక్కిరిసిన మందడం ధర్నా ప్రాంగణం

మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మందడంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. రైతులు, రైతుకూలీలు, మహిళలతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పలువురు రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాలో కూర్చున్నారు. ప్రభుత్వానికి ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలి: కన్నా

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనడం సరికాదన్నారు. రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. తమ ఆందోళనలకు మద్దతు తెలపాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కేసీఆర్‌, జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వ్యవసాయంపై దృష్టి పెట్టాలి: వెంకయ్యనాయుడు

మరొకరికి ఆదర్శంగా ఉండేలా మనల్ని మనం మలచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త ఆలోచనలు, మార్గాలు వెతకాలని తెలిపారు.ఆన్‌లైన్‌ సేవలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయంపై అందరూ దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఐఆర్‌సీటీసీ ఆహార ధరల కొత్త జాబితా !

భారతీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ ఆహార ధరలను సవరించింది. రైల్వేస్టేషన్లలో ఆహారశాలల్లో ఈ ధరల మార్పు వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. ‘‘రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఆహారశాలల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది’’ అని దానిలో వెల్లడించింది. అంటే జనాహార్‌, రిఫ్రెష్‌మెంట్‌ రూమ్స్‌ వంటి వాటికి ఇది వర్తించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. లోయలో పడిన బస్సు..24 మంది మృతి

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో కనీసం 24 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ సుమత్రా ప్రాంతంలో  అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఈ ఏడాది అంబానీ సంపద ఎంతో తెలుసా?

భారత అపరకుబేరుడు, ఆసియా సంపన్నుడు ముఖేశ్‌ అంబానీ సంపద 2019లో ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాలా17 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.2లక్షల కోట్లు. దీంతో డిసెంబరు 23 నాటికి అంబానీ మొత్తం సంపద 61 బిలియన్‌ డాలర్లకు(దాదాపు రూ. 4.3లక్షల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌ తక్షణమే చర్యలు చేపట్టాలి:ఐఎంఎఫ్‌

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న భారత వృద్ధి రేటులో మందగమనం నెలకొనడం పట్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వినియోగం, పెట్టుబడులు, పన్ను ఆదాయం తగ్గడం సహా పలు ఇతర సమస్యలు వేగంగా దూసుకెళుతున్న భారత వృద్ధి రేటుకు అడ్డుకట్ట వేశాయని ఐఎంఎఫ్‌ తన వార్షిక సమీక్షలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఏడు వింతల ఆకృతుల్లో కేకుల తయారీ



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.