close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. అలవోకగా భాజపా ‘సిక్స్‌’.. అధికారం ఫిక్స్‌

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీలో తక్కువ మెజార్టీతో కొనసాగుతున్న యడ్డీ ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే ఉప ఎన్నికల్లో కనీసం ఆరు చోట్ల గెలవాల్సి ఉంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భాజపా అలవోకగా ఆరు చోట్ల విజయం సాధించగా.. మరో ఆరు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన భాజపా ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పార్లమెంటుకు చేరిన ‘పౌరసత్వ సవరణ బిల్లు’

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లు’ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుపై సభ్యులు లేవనెత్తుతున్న అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి మాట్లాడుతూ..మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఈ బిల్లుని తీసుకువచ్చారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఉల్లి.. బంగారం సమానమే: చంద్రబాబు

ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి ధరలను వ్యతిరేకిస్తూ సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని ఆందోళన చేపట్టారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అందుకే ఉల్లి రేటు పెంచారేమో!: పవన్‌

నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేస్తూ వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి ఇదే తార్కాణం అని వ్యాఖ్యానించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెతను పవన్ ఇక్కడ ఉదాహరించారు. ‘సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదని కాబోలు దాని అవసరం లేదని రేటు పెంచారంటూ’ పవన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

5. ప్రాణాలు తీసిన ‘ఉల్లి’!

అమాంతం ఉల్లి ధరలు పెరిగిపోవడంతో రైతు బజార్ల వద్ద ఏర్పడిన క్యూ లైన్లు తాజాగా ప్రాణాలు తీసే స్థితికి చేరాయి. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారులో రాయితీ ఉల్లిపాయల కోసం క్యూలైన్‌లో నిల్చున్న సాంబయ్య(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. రాయితీపై రూ.25కే ప్రభుత్వం ఇస్తున్న ఉల్లి కోసం ఇవాళ ఉదయం నుంచి క్యూలో ఉన్నాడు. కళ్లు తిరిగి పడిపోవడంతో చుట్టుపక్కల వారు  వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘రాంగీ’ టీజర్‌ వచ్చేసింది

7. ఆధార్‌ ఉంటేనే కిసాన్‌ సమ్మాన్‌ నిధులు..!

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన నిధులు కావాలంటే బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆంగ్లపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఒక కథనంలో వెల్లడించింది. కాకపోతే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించలేదు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రూ.10 వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి డిమాండ్‌కు ఊతమివ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అదే భవనంలో మళ్లీ మంటలు

దిల్లీ రాణిఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిన్న ప్రమాదం జరిగిన భవనంలోనే మరోసారి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన సిబ్బంది నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పేశారు. నిన్నటి ఘటనలో 43మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కిమ్‌కు ట్రంప్‌ పరోక్ష హెచ్చరికలు..!

చాలా కీలకమైన ఆయుధ పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించిన ఉత్తరకొరియాపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘కిమ్ జోంగ్‌ ఉన్‌ చాలా తెలివైనవారు. కానీ, ఇలాంటి ప్రతికూల చర్యల వల్ల ఆయన చాలా కోల్పోయే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడితో ఉన్న ప్రత్యేక బంధాన్ని ఆయన రద్దు చేసుకోరనే అనుకుంటున్నా’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. విశ్వసుందరి.. జోజిబిని టుంజీ

ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ నిలిచారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో టుంజీని విజేతగా ప్రకటించారు. గతేడాది విశ్వసుందరి కాట్రియోనా గ్రే.. జోజిబిని టుంజీకు కిరీటం అలంకరించారు. మిస్‌ యూనివర్స్‌ మెక్సికో సోఫియా ఆరాగన్‌, మిస్‌ యూనివర్స్‌ ప్యూర్టోరికా మాడిసన్‌ అండెర్సన్‌ రన్నరప్‌లుగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.