close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

ప్రతిష్ఠాత్మక పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఐక్యతను విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన ఒక చరిత్మాత్మక బిల్లుగా అభివర్ణించారు. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.  మైనారిటీలకు హక్కులు లభిస్తాయన్నారు. శరణార్థుల హక్కులు కాపాడుతుందన్నారు. బిల్లు చట్ట వ్యతిరేకం కాదని ఉద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ‘ఈ చట్టాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు’

పౌరసత్వ(సవరణ) చట్టాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మతపరమైన దాడులు ఎదుర్కొంటున్న మైనారిటీలకు ఇది శాశ్వత ఉపశమనం కల్పిస్తుందని ఉద్ఘాటించారు. ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు పాకిస్థాన్‌ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నేడు దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచారు : చంద్రబాబు

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మెజార్టీ ఉందని.. ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా

వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసును తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పరిణామాలు సాగుతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఆయనకు సిట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ.. రేపు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ఆది నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఇసుమంత సంబంధం ఉందని తేలినా బహిరంగంగా ఉరేసుకుంటానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కారును ఢీకొన్న లారీ.. నలుగురి మృతి

కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులను కారులో ప్రయాణిస్తున్న రాయచోటి వాసులు హర్షద్‌ఖాన్‌, హసజీరా, చిత్తూరు జిల్లా కలికిరి మండల వాసులు హారున్‌బాషా, అఫిరాలుగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 107వ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ ప్రారంభం

కొంపల్లిలో 107వ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్  ప్రారంభమైంది. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్ ఈ బ్రాంచ్‌ని ప్రారంభించారు. మార్గదర్శి చిట్ ఫండ్ గత 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోందని.. ఇవాళ 107వ బ్రాంచ్‌ను కొంపల్లిలో ప్రారంభించడం ఆనందంగా ఉందని శైలజాకిరణ్‌ అన్నారు. ఈ ప్రాంత వినియోగదారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్రాంచ్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘శివసేన, భాజపా మళ్లీ కలవొచ్చు’

శివసేనకు చెందిన సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో శివసేన, భాజపా కలిసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. దీనిపై తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విషయాలపై విభేదించుకోవడం కంటే సర్దుకుపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఆనమ్‌ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు

9. ధోతీలో నోబెల్‌ అందుకున్న అభిజిత్‌

అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకొని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన అభిజిత్‌ బెనర్జీ.. మరోసారి దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే పనిచేశారు. స్వీడన్‌లో మంగళవారం జరిగిన నోబెల్‌ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్‌ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డుఫ్లో భారత సంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరినీ అబ్బురపరిచారు. ధోతి, బంద్‌గలా సూట్‌లో అభిజిత్‌ వేడుకకు హాజరుకాగా.. చీరకట్టు, బొట్టుతో వచ్చిన ఎస్తర్‌ మన సంస్కృతిని ప్రపంచానికి చాటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కలకలం సృష్టించిన రెండుతలల పాము

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.