close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. వికేంద్రీకరణతోనే అభివృద్ధి: బుగ్గన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బుగ్గన సభలో మాట్లాడారు. ‘ఈ బిల్లు చారిత్రాత్మకమైనది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా లోకల్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. 4 జిల్లాలకు కలిపి ఒక జోనల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద నగరం నిర్మించవద్దని శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. దానికి బదులు పరిపాలన వికేంద్రీకరణ మేలని కమిటీ పేర్కొంది.’’అని బుగ్గన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మూడు రాజధానులకు ఒప్పుకోం: చంద్రబాబు

సచివాలయం ఫైర్‌స్టేషన్‌ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన అసెంబ్లీకి నేతలు వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. భావితరాల కోసం పోరాటం చేస్తామని.. అమరావతిని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఒప్పుకోబోమన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ప్రభుత్వం పిరికిపంద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. 

3. ‘అసెంబ్లీ ముట్టడి’ యత్నం

4. రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జి

రాజధానిపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగిన అమరావతి ప్రాంత రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలతోనే రైతులు సచివాలయం, అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్నారు. సచివాలయానికి గుంపులు గుంపులుగా తరలివస్తున్నారు. సచివాలయం వెళ్లిన దారిలో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్టు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రాజధాని రైతుల  ఆక్రందనలు

6. ప్రభుత్వానికి భంగపాటు తప్పదు: లోకేశ్‌

రాష్ట్రానికి మూడు రాజధానులు అంశంపై శాసనమండలిలో ప్రవేశ పెట్టే బిల్లును వ్యతిరేకించి తీరుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాని విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శాసనమండలిలో ప్రభుత్వానికి భంగపాటు తప్పదని లోకేశ్‌ హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కాలినడక అసెంబ్లీకి తెదేపా నేతలు

8. ముళ్ల కంచెలను దాటుకుంటూ!

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇవాళ కేబినెట్‌ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి రైతులు నిరసనలు ఉద్ధృతం చేశారు. పోలీసు ఆంక్షలు, కాకీ కవాతులు, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా సచివాలయం రెండో గేటు సమీపానికి రైతులు దూసుకొచ్చారు. మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా అక్కడికి తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. నిర్బంధంతో ఉద్యమం ఆపలేరు: గల్లా

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికంగా ఉందన్నారు. హైకోర్టు  చెప్పినా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారన్నారు. మహిళలను విచక్షణారహితంగా కొట్టారని ధ్వజమెత్తారు. నిర్బంధంతో ఉద్యమం ఆపలేరన్నారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రత్యక్షప్రసారం



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.