close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024897 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => Xr5gf6px4vE [video_short_link] => Xr5gf6px4vE [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-02-21 13:02:24.693307 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. తొలి రోజు నిరాశ పర్చిన టీమ్‌ఇండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున టీమ్‌ఇండియా నిరాశపరిచింది. కివీస్‌ బౌలర్ల ధాటికి ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె(38; 122 బంతుల్లో 4x4), యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌(10; 37 బంతుల్లో 1x4) క్రీజులో ఉన్నారు. 55 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఎంతసేపటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

2. దేశమంతా శివోహం.. శివోహం..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవుడికి పూజలు అందిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో నీలకంఠుడి పట్ల ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ‘ఓం నమ: శివాయ’ మంత్రోచ్చరణతో ఆ త్రినేత్రుడి యందు మనసుని లగ్నం చేసి తన్మయత్వం పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వాయులింగ క్షేత్రం ..భక్తజన సంద్రం

దక్షిణ కైలాసంగా.. వాయులింగ క్షేత్రంగా పూజలు అందుకుంటున్న శ్రీకాళహస్తిలోని శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభంగా సాగుతున్నాయి. ఆలయ మండపాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా  8 టన్నుల పండ్లు..పూలను బెంగళూరు నుంచి దేవస్థానం అధికారులు తీసుకొచ్చి అలంకరింపజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వేములవాడ రాజన్నకు భక్తజన నీరాజనం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో వేములవాడ ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఆధార్‌ ఉందా.. పదినిమిషాల్లో పాన్‌కార్డ్‌ ఇలా..

పాన్‌కార్డ్‌ విషయంలో తలనొప్పులు లేకుండా చూడాలని ఆదాయపన్నుశాఖ భావించి పలు ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఆధార్‌ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో ఇస్తే కొన్ని నిమిషాల్లోనే పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌(పాన్‌) సంఖ్యను జారీ చేస్తోంది. ఇది పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో మీకు వస్తుంది. సాధారణ పాన్‌ కార్డుకు ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

6. మహిళా అధికారుల గొంతుగా ఐశ్వర్య..

మహిళలు సైన్యంలో తమను తాము నిరూపించుకొనే అవకాశాం దాదాపు పదేళ్ల న్యాయ పోరాటం తర్వాత దక్కించుకొన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ పొందే అవకాశం కల్పించాలని చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మహిళా అధికారులకు అనుకూలంగా ఈ తీర్పు రావడం వెనుక ఒక ప్రతిభావంతురాలి కృషి ఉంది. ఆమే ఐశ్వరా భాటి. న్యాయ విద్యలో బంగారు పతక గ్రహీత కూడా. న్యాయస్థానంలో మరో లాయర్‌ మీనాక్షి లేఖితో కలిసి ఆమె ఈకేసును వాదించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. ‘అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదు’

సీఏఏకు వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన సభలో ఓ యువతి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. కాగా.. యువతి ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదని, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని యువతి తండ్రి స్పష్టంగా చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. భారత్‌తో బ్రహ్మాండమైన డీల్‌ కుదరొచ్చు:ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడారు. ‘బ్రహ్మాండమైన డీల్‌’ కుదుర్చుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అన్న తమ విధానాన్ని మాత్రం విస్మరించే ప్రసక్తే లేదన్నారు. మరో మూడు రోజుల్లో భారత పర్యటనకు రానున్న తరుణంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మరో 118 మంది కరోనాకు బలి

కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,236కు చేరింది. గురువారం మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మంది హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే. ఇక వైరస్‌ బాధితుల సంఖ్య 75,400 దాటింది. కొత్తగా మరో 889 మందిలో వైరస్‌ జాడను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త పెరిగినప్పటికీ... వైరస్‌ వ్యాప్తి బారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’ టీజర్‌



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.