close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025859 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => ffZRRHCvOaE [video_short_link] => ffZRRHCvOaE [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-02-23 13:03:56.812683 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1 PM

1. మాతృ భాషను, జన్మభూమిని మరిచిపోవద్దు

ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు వరంగల్‌లో ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి. మాతృ భాషను, జన్మభూమిని మరిచిపోవద్దు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మచ్చలేని చరిత్ర ఎర్రన్నాయుడి సొంతం

తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ట్విటర్‌ వేదికగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజా నాయకుడి సేవలను స్మరించుకుందామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ఆత్మీయ నేస్తామని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మద్యం మత్తుకి ముగ్గురు యువకుల బలి

అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపిన వారిని మితిమీరిన వేగం బలిగొంది. చంపాపేట్ కి చెందిన నలుగురు స్నేహితులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు  డ్రైవింగ్ చేస్తూ... కర్మన్‌ ఘాట్ చౌరస్తా సమీపంలో ఓ చెట్టును ఢీ కొన్నారు. అనంతరం కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ మెస్ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మూడో రోజు టీమ్‌ఇండియా 144/4

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్‌ 39 పరుగుల వెనుకంజలో ఉంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(25; 67 బంతుల్లో 4x4), హనుమ విహారి(15; 70 బంతుల్లో 2x4) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు వీరిద్దరి బ్యాటింగ్‌పైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి ఇలా..?

ప్రభుత్వం గతేడాది పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. డిపాజిట్ల పొడిగింపు.. వడ్డీ విధానాల్లో కీలకమైన మార్పులు చేసింది. వీటిల్లో కొన్ని నిబంధనలను సడలిస్తే.. మరికొన్ని నిబంధనలను బిగించింది. మొత్తానికి పీపీఎఫ్‌ నిర్వహణను సులభతరం చేసే  ప్రయత్నం చేసింది. చిన్నమొత్తాల పొదుపునకు ఇదే కీలకం కావడంతో ప్రభుత్వం దీనిపై మరింత శ్రద్ధ చూపిస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాలపై ప్రభుత్వం 7.9శాతం వడ్డీ చెల్లిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఇద్దరు దర్శకులు

టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు దర్శకుడు ఎవరంటే సినీ ప్రియులెవరైనా రాజమౌళి అని టక్కున చెబుతారు. కానీ గూగుల్‌ మాత్రం రాజమౌళితోపాటు మరో వ్యక్తి పేరు కూడా చూపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. దర్శకత్వం స్థానంలో రాజమౌళి పేరుతో పాటు సంజయ్‌ పాటిల్‌ అనే వ్యక్తి పేరు కూడా కనిపిస్తోంది. సంజయ్‌పాటిల్‌ గురించి సెర్చ్‌ చేస్తే ఎలాంటి సమాచారం చూపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వారు త్వరగా విడుదలవ్వాలని ప్రార్థిస్తున్నా:రాజ్‌నాథ్‌

నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు వీలైనంత తర్వగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నానని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘సోకడం తగ్గింది.. కోలుకోవడం పెరిగింది’

కొవిడ్‌-19 ధాటికి నిన్న మరో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 96 మంది హుబెయ్‌కు చెందినవారే. మృతుల సంఖ్య 2,442కు చేరింది. మరో 648 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 76,936కు చేరింది. హుబెయ్‌ ప్రావిన్సులో 630 కొత్త కేసులు నమోదుకాగా.. అక్కడ వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 64,084కు తాకింది. కొత్తగా వైరస్‌ సోకుతున్న వారి కంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆ తల్లి ఆవేదన.. అర్థం చేసుకున్న నెటిజెన్లు

సూటిపోటి మాటలు, ఎగతాళి, వేధింపులు.. ఇతరులను ఎంత ఇబ్బందులకు గురిచేస్తాయో చెప్పడానికి నిదర్శనమే ఈ వార్త. తొమ్మిదేళ్ల కుమారుడు నిత్యం అనుభవిస్తున్న నరకాన్ని కళ్లకు కట్టింది ఆ తల్లి. ఆమె ఆవేదన అర్థం చేసుకున్న నెటిజెన్లు మేమున్నామంటూ ముందుకొచ్చారు. లక్షలాది డాలర్లు విరాళాలుగా అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పసందైన రుచులను ఆస్వాదించనున్న ట్రంప్‌

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.