close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120068183 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => CItiAujfRl8 [video_short_link] => CItiAujfRl8 [created_by] => 8925086 [created_date] => 2020-05-25 12:48:37.341601 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. కరోనాలో టాప్‌టెన్‌కు భారత్‌!

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,845కి చేరింది. అత్యధికంగా కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌టెన్‌లోకి వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీలో కొత్తగా 44 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఏడు కోయంబేడు కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో 5 ఉండగా..నెల్లూరు జిల్లాలో మరో రెండు కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3.  వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాం: జగన్‌

గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘మన పాలన-మీ సూచన’’ పేరిట విభాగాల వారీగా సీఎం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అవినీతి, వివక్షకు ఎక్కడా తావులేకుండా పనిచేయడం ముఖ్యమన్నారు. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చి ముందుకెళ్తున్నామని చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే సేవలు అందిస్తున్నామని తెలిపారు. లక్షా 35వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా ఉండదేమోనన్నారు. 

4. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రెండు నెలల తర్వాత దేశీయ విమాన సేవలు నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరి నిమిషంలో విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలు విమాన సర్వీసుల్లో మార్పులు చేశారని నిరసన చేపట్టారు. దీంతో విమానాల కోసం కొన్ని గంటలుగా లాంజ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఆయన లాంటి వారు చాలా అరుదు 

భారత హాకీ దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాల విజేత సీనియర్‌ బల్బీర్‌ సింగ్‌(95) మృతిచెందడంపై పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో బల్బీర్‌ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే సామాజిక మాధ్యమాల ద్వారా క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. జూన్‌లో దారుణ పరిస్థితిని ఎదుర్కోనున్నాం!

భారత్‌ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత తీవ్రం కానుంది.  జూన్‌లో పరిస్థితి దారుణంగా ఉండనుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కానీ, ఆర్థికపరమైన ఆందోళనలు దశలవారీ సడలింపులకు కారణమయ్యాయి. మొదట లాక్‌డౌన్‌, తరవాత సడలింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆ చిత్రాన్ని 20 సార్లు చూశా!: బన్నీ

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ఇటీవల ఓ ఆంగ్ల‌ పత్రికతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనకు నచ్చిన బాలీవుడ్‌ చిత్రాల గురించి తెలియజేశారు. ‘‘నాకిష్టమైన చిత్రాల్లో ‘జో జీతా వహీ సికందర్‌’ ఒకటి. 20 కంటే ఎక్కువ సార్లే దానిని వీక్షించాను. అలాగే షారుఖ్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రాన్ని కూడా ఎక్కువసార్లు చూశాను. ఇటీవల కాలంలో విడుదలైన ‘గల్లీబాయ్‌’ని 3-4 సార్లు చూశాను. వ్యక్తిగతంగా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది’ అని బన్నీ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా హింజిపొర ప్రాంతంలోని దమ్‌హాల్‌ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు బలగాల వలలో చిక్కారు. లొంగిపోవాలని ఆదేశించినప్పటికీ అందుకు నిరాకరించారు. పైగా కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భూమి కంపించినా బెదరని ప్రధాని!

న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న  ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. తానున్న భవనం కుదుపులకు లోనవుతున్నా.. పెద్దగా ఆందోళనకు గురికాలేదు. అయితే.. ఆమె ధీమాకు కారణం లేకపోలేదు లెండి! పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రాణభయంతో ముందుకెళ్లిన మృగరాజులు



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.