Delta Variant: డెల్టా వేరియంట్‌పై ఆందోళన..!

తాజా వార్తలు

Published : 02/06/2021 10:43 IST

Delta Variant: డెల్టా వేరియంట్‌పై ఆందోళన..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా(బి.1.617) వేరియంట్‌ మొత్తంలో ఒక స్ట్రెయిన్‌ అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకం వేరియంట్‌ వైరస్‌ మళ్లీ మూడు స్ట్రెయిన్లుగా మారిందని.. వాటిల్లో కూడా బి.1.617.2 రకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని వెల్లడించింది.

గత నెల బి.1.617ను ‘ఆందోళనకర వేరియంట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దీనిలో కూడా బి.1.617.2 స్ట్రెయిన్‌ మాత్రమే ‘ఆందోళనకర వేరియంట్‌’ హోదాకు అర్హమైందని పేర్కొంది.  మిగిలిన రెండు స్ట్రెయిన్లు తక్కువగా వ్యాపిస్తున్నట్లు గమనించామని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతివారం విడుదల చేసే నివేదికలో భాగంగా ఈ వివరాలు వెల్లడించింది. ఈ రకం వైరస్‌ వ్యాపిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతన్నట్లు తాము గమనించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఈ వైరియంట్‌పై పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. బి.1.617.1 స్ట్రెయిన్‌ స్థాయిని తగ్గించగా..  బి.1.617.3 స్ట్రెయిన్‌ను గమనిస్తుండాలని పేర్కొంది.  వేరియంట్లను కనుగొన్న ప్రదేశాల పేర్లను పెట్టడం వల్ల తలెత్తే ఇబ్బందులు తొలగించడానికే గ్రీకు పదాలను వాడినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని