Oxygen: విష సర్పానికి నోటితో ఆక్సిజన్‌!

తాజా వార్తలు

Updated : 30/05/2021 11:01 IST

Oxygen: విష సర్పానికి నోటితో ఆక్సిజన్‌!

పామును చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కొంత ధైర్యం చేసే వాళ్లు దాన్ని కర్రతో కొట్టేందుకే చూస్తారు. కానీ.. ఓ వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ నాగుపాము(కోబ్రా)కు నోటితో ఆక్సిజన్‌ అందించి రక్షించాడు. ఈ సంఘటన ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. నువాగూడ షాహీలో ఓ వ్యక్తి తన ఇంట్లోకి పాము రావడంతో స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఆ సర్పం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. కదల్లేని స్థితిలో సొమ్మసిల్లిపోయి ఉన్న ఆ కోబ్రాకు.. స్నేహాశీష్‌ అనే హెల్ప్‌లైన్‌ సభ్యుడు చిన్న పైపు సాయంతో నోటితో ఆక్సిజన్‌ అందించి ప్రాణాలు కాపాడాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సకాలంలో స్పందించి పాము ప్రాణాలు రక్షించిన.. స్నేహాశీష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని