Pakisthan: అమ్మాయి దుస్తులు చించేసి.. ఆమెను గాల్లోకి ఎగరేశారు!

తాజా వార్తలు

Updated : 19/08/2021 04:08 IST

Pakisthan: అమ్మాయి దుస్తులు చించేసి.. ఆమెను గాల్లోకి ఎగరేశారు!

లాహోర్‌: పాకిస్థాన్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఒక యువతితో వందలమంది అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులను చించేసి.. ఎత్తుకొని గాల్లోకి ఎగరేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని  లాహోర్‌లో  కొద్ది రోజుల క్రితం చోటు చేసుకుంది. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆకతాయిలు చేసిన అల్లరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఓ అమ్మాయి సరదాగా వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఆగస్టు 14న తన స్నేహితులతో కలిసి వీడియో చిత్రించడానికి గ్రేటర్ ఇక్బాల్ పార్క్ వద్దకు వెళ్లింది. అక్కడికి 300కు పైగా మంది వచ్చారు. అమ్మాయి ఉన్న ప్రదేశానికి వెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు. తన దుస్తులను పట్టుకొని లాగారు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకొని గాల్లోకి ఎగరేశారు. అల్లరి మూక నుంచి తప్పించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేసింది. అంత మంది మధ్యలో నుంచి తప్పించుకోలేక విలవిలలాడింది. ఇదంతా గమనించిన అక్కడి సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయిని వారి చెర నుంచి విడిపించారు. అయితే, ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని