రెండో రౌండ్‌లోనూ పల్లా ఆధిక్యం
close

తాజా వార్తలు

Updated : 18/03/2021 08:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో రౌండ్‌లోనూ పల్లా ఆధిక్యం

నల్గొండ ‌: నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.  రెండో రౌండ్‌ ముగిసే సరికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి  సమీప ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి  ఓట్లు, 15,857, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12,070, తెజస అభ్యర్థి కోదండరామ్‌కు 9,448, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి  6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244 ఓట్లు పోలయ్యాయి.

మొదటి రౌండ్‌లో...
తొలి రౌండ్‌లో పల్లాకు 16,130 ఓట్లు రాగా.. తీన్నార్‌ మల్లన్నకు 12,046, కోదండరాంకు 9,080 ఓట్లు, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి 6,615 ఓట్లు వచ్చాయి. ఇంకా ఐదు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాంలో బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి కావచ్చని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో), నల్గొండ కలెక్టరు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వెల్లడించారు. మొత్తం 731 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను ఎనిమిది హాళ్లలో 56 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఇక్కడ 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానంలో 3,85,996 ఓట్లు పోలయ్యాయి.

1,054 ఓట్ల ఆధిక్యంలో సురభి వాణీదేవి

 హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ  స్థానానికి సంబంధించి ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 5,082 ఓట్లు పోలయ్యాయి.

 799 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను 8 హాళ్లలో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక, ఎన్నికల పరిశీలకులు హర్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో  93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...3,57,354 ఓట్లు పోలైన విషయం తెలిసిందే.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని