ఐదు రౌండ్లలో వాణీదేవి(తెరాస) ఆధిక్యం 
close

తాజా వార్తలు

Updated : 19/03/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు రౌండ్లలో వాణీదేవి(తెరాస) ఆధిక్యం 

హైదరాబాద్‌, నల్గొండ: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఐదో రౌండ్‌ ఫలితాలు వచ్చాయి. అన్ని రౌండ్లలో కలిపి తెరాస అభ్యర్థి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్‌ ఫలితాలను లెక్కిస్తున్నారు.   నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి సంబంధించి తెరాస తరఫున పోటీచేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆరు రౌండ్‌ల ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఏడో రౌండ్‌ లెక్కింపు చేపట్టారు.  

ఐదు రౌండ్లలో సురభి వాణీదేవి(తెరాస) ఆధిక్యం.. 
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఐదో రౌండ్ల ఫలితాల్లో తెరాస తరుఫున పోటీచేసిన సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప అభ్యర్థి, భాజపా నుంచి పోటీచేసిన రాంచందర్‌రావుపై 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదు రౌండ్లలో వాణీదేవికి 88,304, రాంచందర్‌రావు(భాజపా)కు 81,749, ప్రొ.నాగేశ్వర్‌కు 42,604, చిన్నారెడ్డి(కాంగ్రెస్‌)కి 24,440, ఎల్‌.రమణ(తెదేపా)కు 4,656 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు రౌండ్లలో 16,712 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 2,80,030 ఓట్లు లెక్కించారు.  
నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఆరో రౌండ్‌ ఫలితాలు..
తెరాస తరఫున పోటీచేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 22,843 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆరు రౌండ్లకు గానూ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 95,317 ఓట్లు లభించాయి. ఇక ద్వితీయ స్థానంలో ఉన్న తీన్మార్‌ మల్లన్నకు 72,474 ఓట్లు లభించాయి. ప్రొ.కోదండరాం మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు 59,705 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో భాజపా తరఫున పోటీచేసిన ప్రేమందర్‌రెడ్డికి 34,228 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రాములు నాయక్(24,268 ఓట్లు) ఐదో స్థానంలో ఉన్నారు. ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు నాలుగో రౌండ్‌ పూర్తి కాగా తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఆరో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16,204 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 11,910 ఓట్లు, కోదండరాంకు 10,505 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 5,237 ఓట్లు, రాములు నాయక్‌కు 3,994 ఓట్లు వచ్చాయి. 
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నాలుగో రౌండ్..
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి నాలుగో రౌండ్‌ ముగిసే సరికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి సమీప అభ్యర్థి రాంచందర్‌రావు(భాజపా)పై  5,553 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్‌ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవికి 70,552, రాంచందర్‌రావుకు(భాజపా) 64,999, స్వంతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 34,029, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 20,053 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 13,364 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. నాలుగు రౌండ్లలో కలిపి 2,24,032 ఓట్లను లెక్కించారు. 
నల్గొండ-వరంగల్‌-ఖమ్మంలో..
ఐదో రౌండ్‌ ముగిసే సరికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 18,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 5 రౌండ్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 79,113, తీన్మార్‌ మల్లన్నకు 60,564, తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌కు 49,200, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 28,991, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 20,774 ఓట్లు వచ్చాయి. ఐదు రౌండ్లలో మొత్తం 15,533 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఆరో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్ల వారీగా అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే..
ఐదో రౌండ్‌లో..
పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,671 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 12,560, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 9,585, ప్రేమేందర్‌రెడ్డికి 5,288, రాములు నాయక్‌కు 4,340 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి 3,111 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
నాలుగో రౌండ్‌లో..
తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 17,100 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 13,500, తెజస అభ్యర్థి ప్రొ.కోదండరామ్‌ 11,917 ఓట్లు సాధించారు. నాలుగో రౌండ్‌లో పల్లాకు 3,600 ఓట్ల ఆధిక్యం లభించింది.

మూడో రౌండ్‌లో..
పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,558 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు  11,742, తెజస అభ్యర్థి ప్రొ.కోదండరామ్‌కు 11,039, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి  5,320, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4,333 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో పల్లాకు 3,816 ఓట్ల ఆధిక్యం లభించింది.
రెండో రౌండ్‌లో..
రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి  ఓట్లు, 15,857, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 12,070, తెజస అభ్యర్థి కోదండరామ్‌కు 9,448, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి  6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244 ఓట్లు పోలయ్యాయి.
మొదటి రౌండ్‌లో...
తొలి రౌండ్‌లో పల్లాకు 16,130 ఓట్లు రాగా.. తీన్మార్‌‌ మల్లన్నకు 12,046, కోదండరాంకు 9,080 ఓట్లు, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి 6,615 ఓట్లు వచ్చాయి. 
నల్గొండలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాంలో బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియ ఈరోజు రాత్రికి పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.మొత్తం 731 పోలింగ్‌  కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను ఎనిమిది హాళ్లలో 56 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఇక్కడ 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానంలో 3,85,996 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో..
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్డేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 799 పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పత్రాలను 8 హాళ్లలో 56 టేబుళ్ల వద్ద లెక్కిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్‌.లోకేష్‌కుమార్, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక, ఎన్నికల పరిశీలకులు హర్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో  93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...3,57,354 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
మూడోరౌండ్‌.. సురభి వాణీదేవికి 4,444 ఓట్ల ఆధిక్యం 
మూడో రౌండ్‌ముగిసే సరికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై 4,444 ఓట్ల ఆధిక్యం లభించింది. మూడు రౌండ్లలో కలిపి సురభి వాణీదేవికి 53,007 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు 48,563, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 25,505, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 15,035 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు 10,082 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో ఇంకా రెండు రౌండ్లు, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానంలో ఇంక ఒక రౌండ్‌ ఓట్లు లెక్కించాల్సి ఉంది.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని