
తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికలపై విచారణ వాయిదా
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం ఏజీ వాదనలు కొనసాగించనున్నారు.
పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఈసీ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ).. ధర్మాసనం ముందు సవాల్ చేసింది.
Tags :