పంచాయతీ పోరుపై విచారణ రేపటికి వాయిదా

తాజా వార్తలు

Updated : 18/01/2021 19:04 IST

పంచాయతీ పోరుపై విచారణ రేపటికి వాయిదా

అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది. తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌, ఎస్‌ఈసీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల సమయం ముగిసి ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయిందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుందని ఏజీ శ్రీరామ్‌ వాదించారు. వ్యాక్సినేషన్‌లో 23 ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నాయని.. రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం దశల వారీగా ప్రక్రియ కొనసాగుతుందని.. దానికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను హైకోర్టుకు మంగళవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యులు ఏం చెబుతున్నారు?

మహారాష్ట్రకు అంగుళం భూమి కూడా ఇవ్వం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని