పంత్ నువ్వు కామెంటరా? వికెట్‌కీపరా?
close

తాజా వార్తలు

Published : 15/02/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్ నువ్వు కామెంటరా? వికెట్‌కీపరా?

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్ మైదానంలో ఉంటే ఆటగాళ్లకే కాదు అభిమానులకు ఎంతో సరదాగా ఉంటుంది. వికెట్ల వెనుక నుంచి పంత్‌ ‘కమాన్‌ యాష్’‌.. అంటుంటే అశ్విన్‌ రెట్టింపు ఉత్సాహంతో బంతులు వేస్తుంటాడు. అంతేకాదు, సహచర ఆటగాళ్లలో ఉత్తేజం నింపడానికి మధ్యలో పాటలు పాడుతుంటాడు. ఇక పంత్ చేసే అల్లరి చేష్టలకు ప్రత్యర్థులకు మతిపోతుంటుంది. కామెంటరీ కంటే ఎక్కువగా మాట్లాడుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చిరాకు తెప్పిస్తుంటాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ పంత్‌ అదే పని చేశాడు. దీంతో మైదానంలో చురుకుగా ఉంటున్న పంత్‌ గురించి నెట్టింట్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. కామెంటరీ బాక్సులో ఉన్న వ్యాఖ్యాతల కంటే పంతే ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడని, అతడికి డబ్బులు చెల్లించాలని సరదాగా ట్వీట్‌లు చేస్తున్నారు. వీలైతే మైక్‌ స్టంప్‌ ఆడియో రికార్డును కొనుగోలు చేస్తామని, ఎందుకంటే అందులో పంత్ మాటలన్నీ ఉంటాయని కొందరు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఐపీఎల్‌లో దిల్లీ ఆడని మ్యాచ్‌ల్లో పంత్‌తో కామెంటరీ చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

అ‘స్పిన్’‌ ఉచ్చులో ఇంగ్లాండ్‌ విలవిల 

అశ్విన్‌ రికార్డుల పరంపర

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని