ఆ వ్యాఖ్యలు జగన్‌కే ప్రమాదం: పరిపూర్ణానంద
close

తాజా వార్తలు

Published : 08/04/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ వ్యాఖ్యలు జగన్‌కే ప్రమాదం: పరిపూర్ణానంద

తిరుపతి: ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణదీక్షితుల వ్యాఖ్యలను సీఎంతో పాటు వైకాపా నేతలే ఖండించాలని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రత్నప్రభకు ఓటేయాలని కోరారు. తిరుపతిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న సీఎంకు ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. తితిదేను సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రెండేళ్లుగా తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని.. ఆలయాల కూల్చివేతలపై స్పందించడం లేదెందుకని నిలదీశారు. 

తితిదే బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందని పరిపూర్ణానంద ఆరోపించారు. సీఎంను విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని చెప్పారు. వైకాపా నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని ప్రశ్నించారు. పింక్‌ డైమండ్‌ ఏమైందని.. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దానికి ప్రస్తావన రావడం లేదని ఆయన నిలదీశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని