ఏలూరులో పెరుగుతున్న అస్వస్థత కేసులు
close

తాజా వార్తలు

Updated : 07/12/2020 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏలూరులో పెరుగుతున్న అస్వస్థత కేసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఇప్పటివరకు ఆస్పత్రి వచ్చిన బాధితుల సంఖ్య 464కి చేరింది. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 289 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశామని.. ఇంకా 158 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉందని, ఏం జరిగిందో తెలిసేలోపే కిందపడిపోయామని బాధితులు చెబుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకునేందుకు దిల్లీలోని ఎయిమ్స్‌ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు. 

ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా? అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆర్గానో క్లోరినో’ అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశముంది. బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

రేపు కేంద్రబృందం రాక
అంతుచిక్కని అనారోగ్య సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దిల్లీ ఎయిమ్స్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జంషెడ్‌ నాయర్‌ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. దీనిలో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైరాలజిస్ట్‌ అనినాష్‌ దేవ్‌, ఎన్‌సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ సంకేత కులకర్ణి ఉన్నారు. రేపు ఉదయం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ బృందాన్ని ఆదేశించింది.

ఇవీ చదవండి
కుప్పకూలుతున్నారు!

ఆగని కలవరం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని