
తాజా వార్తలు
కరోనాపై పోరుకు పవన్ రూ.2కోట్లు విరాళం
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్ కల్యాణ్ ట్విటర్లో వెల్లడించారు. ప్రధాని తీసుకుంటున్న చర్యలు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉపయోగపడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
