మాయగాడు.. బాలికను గర్భవతిని చేశాడు
close

తాజా వార్తలు

Published : 30/01/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాయగాడు.. బాలికను గర్భవతిని చేశాడు

చిట్టినగర్, (విజయవాడ)న్యూస్‌టుడే: ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు ఓ మాయగాడు. ఈ విషయం శుక్రవారం వెలుగుచూడడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన విజయవాడ నగరం కొత్తపేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరం కొత్తూరు తాడేపల్లి లంబాడీతండాలో నివాసం ఉంటున్న బాలిక (14)పై అదే వీధిలో ఉంటున్న బాణావత్‌ ప్రసాద్‌ (20) కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి స్నేహితుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా శారీక సంబంధం సాగిస్తున్నాడు. ఇటీవల ఆ బాలిక మానసిక ప్రవర్తనలో తేడా కనిపించడంతో ఆమె అక్క నిలదీసింది. దీంతో బాలిక అసలు విషయం చెప్పింది. బాలికను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భవతి అని వారు చెప్పారు. బాలికను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. 

ఇవీ చదవండి
సినీ నిర్మాత కారు మాయం

కుటుంబం కోసం కూతురి ఆరాటం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని