స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధర
close

తాజా వార్తలు

Published : 04/05/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధర

దిల్లీ: దేశంలో  18 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలను చివరిసారి ఏప్రిల్‌ 15న సవరించారు. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై  14 పైసలు తగ్గించారు.

ఈరోజు పెరిగిన ధరతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.55కు, డీజిల్‌ ధర రూ.80.91లకు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16, డీజిల్‌ ధర రూ.88.25కు చేరగా.. విశాఖలో పెట్రోల్‌ ధర రూ.95.73, డీజిల్‌ ధర రూ.89.31గా  ఉంది. గతేదాడి మార్చిలో కేంద్రం చమురుపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినప్పటి నుంచి  ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 చొప్పున పెరిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని