Kejriwal: అందుకు ఆ సంస్థలు అంగీకరించలేదు
close

తాజా వార్తలు

Updated : 24/05/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kejriwal: అందుకు ఆ సంస్థలు అంగీకరించలేదు

దిల్లీ: కరోనా టీకాల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నప్పటికీ.. ఆయా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు మాత్రం ఇందుకు సుముఖత చూపించట్లేదు. టీకాలను నేరుగా రాష్ట్రాలకు విక్రయించబోమని అమెరికా ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడెర్నా చెప్పాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వ్యాక్సిన్‌ డీల్‌ కేంద్రంతోనే ఉంటుందని ఆ సంస్థలు చెప్పినట్లు తెలిపారు. 

‘‘టీకాల కోసం మేం ఫైజర్‌, మోడెర్నా సంస్థలతో మాట్లాడాం. కానీ, మాకు నేరుగా వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఆ రెండు సంస్థలు అంగీకరించలేదు. టీకాలపై కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకుంటామని చెప్పాయి. అందువల్ల కేంద్రం త్వరగా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుని, రాష్ట్రాలకు సరఫరా చేయాలని మేం కోరుతున్నాం’’ అని కేజ్రీవాల్‌ సోమవారం తెలిపారు. నిన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీంద్‌ సింగ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. టీకాల కోసం తాము మోడెర్నా సంస్థను సంప్రదించగా.. నేరుగా రాష్ట్రాలకు విక్రయించబోమనని ఆ సంస్థ చెప్పిందని అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. 

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో విదేశీ సంస్థలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ సహా పలు రాష్ట్రాలు గ్లోబర్‌ టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఔషధ సంస్థల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. మరోవైపు టీకాల కొరతతో 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ పంపిణీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దిల్లీలోని చాలా కేంద్రాల్లో టీకా పంపిణీ నిలిపివేసినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని