
తాజా వార్తలు
తిరుమల మాడ వీధుల్లో వరాహాల సంచారం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఇటీవల వరాహాల సంచారం అధికమైంది. ఆదివారం తెల్లవారుజామున ఓ వరాహ గుంపు ఆలయం సమీపంలోని తిరుమాడ వీధుల్లో సంచరించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో తరచూ వరాహాలు సంచరిస్తున్నా.. భద్రతా సిబ్బంది వాటిని నిలువరించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచే తిరుమలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
ఎస్వీబీసీ ట్రస్టుకురూ.80 లక్షల విరాళం
డీజీపీ వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి: భాజపా
Tags :