కరోనాకు ఏకైక మందు ధైర్యమే: ఈటల
close

తాజా వార్తలు

Updated : 20/08/2020 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు ఏకైక మందు ధైర్యమే: ఈటల

హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో హైదరాబాద్‌ పోలీసు ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ... కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమని వివరించారు.

 ‘‘అమెరికాలాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నాం. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తు చేసింది. వైద్యులు ఎంతో సాహసంతో చికిత్స చేస్తూ దేవుళ్ల స్థానంలో నిలిచారు.  కరోనా వల్ల కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది రోగులకు తోడుగా ఉండటం అభినందనీయం. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని విధాలుగా తోడుగా ఉండటం అభినందనీయం. కరోనాకు భయపడి ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదు. క్యాన్సర్‌, మూత్రపిండాలు, ఇతర వ్యాధులతో బాధపడేవాళ్లు దానికి తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఆయా వ్యాధులతో మృతి చెందే ప్రమాదముంది. ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చింది. కొవిడ్‌ ఔషధాలతో పాటు ప్లాస్మా చికిత్స ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది. అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందించాలి.’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీపీ అంజనీకుమార్‌ పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్లాస్మా దాతలు పాల్గొన్నారు.

 ప్లాస్మా దానం చేసేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన donateplasma.hcsc.in  వెబ్‌సైట్‌ను మంత్రి ఈటల ప్రారంభించారు. 
 ప్లాస్మా దానం చేయాలనుకునేవారు  94906 16780, 040-23434343 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని