బెంగాల్‌లో 8 విడతలపై సుప్రీంకు..  
close

తాజా వార్తలు

Published : 01/03/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో 8 విడతలపై సుప్రీంకు..  

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడతల్లో శాసనసభ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 24 నియమాలను ఉల్లంఘిస్తోందని, దీనిపై వెంటనే స్టే విధించాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. 

దీంతో పాటు ఎన్నికల ప్రచార సమయంలో మతపరమైన నినాదాల అంశాన్ని కూడా పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైశ్రీరాం, ఇతర మతపరమైన నినాదాలు రాష్ట్రంలో శాంతి సౌభ్రాతృత్వాలకు భంగం కలిగిస్తున్నాయని, ఆ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 

పశ్చిమబెంగాల్ సహా కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగా.. బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు మొత్తం 8 విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని