అమితాబ్‌పై దిల్లీ కోర్టులో పిటిషన్‌
close

తాజా వార్తలు

Published : 07/01/2021 23:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమితాబ్‌పై దిల్లీ కోర్టులో పిటిషన్‌

ముంబయి: కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గాత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆయన అనర్హుడు అంటూ దిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌ నుంచి తొలగించాలని ఆయన కోరారు. అమితాబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

‘కరోనాకాలంలో ఎంతో మంది సినిమా ప్రముఖులు సమాజసేవలో పాల్గొన్నారు. పేదలకు భోజనం పెట్టారు. వసతి కల్పించారు. నిత్యావసరాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగానూ ఆదుకున్నారు. ఇలా వాళ్లకు తోచిన సాయం చేశారు. దేశసేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్‌ట్యూన్‌కు ఉచితంగా తమ మాటలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అమితాబ్‌ మాత్రం.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడేమో ఆయన కుటుంబం కూడా కరోనా నుంచి బయటపడలేకపోయింది’ అని ఆ పిటిషనర్‌ పేర్కొన్నారు.

‘అమితాబ్‌ ఒక సామాజిక కార్యకర్తగా దేశ సేవ చేయలేదు. ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడు’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌ ధర్మాసనం గురువారం విచారించింది. కాగా కోర్టు తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి!

సమంత తొలి వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని