‘మొదటి టీకా డోసు ప్రధాని తీసుకోవాలి’
close

తాజా వార్తలు

Published : 08/01/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మొదటి టీకా డోసు ప్రధాని తీసుకోవాలి’

పట్నా: అత్యవసర వినియోగం నిమిత్తం కేంద్రం రెండు కరోనా వైరస్ టీకాలకు అనుమతులు ఇవ్వడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శకుల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ ‌(ఆర్జేడీ)నేత తేజ్‌ ప్రతాప్ యాదవ్ చేరారు. టీకా మొదటి డోసును ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘కొవిడ్‌-19  టీకా మొదటి డోసును ప్రధాని నరేంద్రమోదీ తీసుకోవాలి. ఆ తర్వాత మేమంతా తీసుకుంటాం’ అని తేజ్‌ ప్రతాప్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. కొవిడ్ టీకాను తాను తీసుకోబోనని, అది భాజపా టీకా అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..రాష్ట్రవ్యాప్తంగా టీకా పంపిణీకి సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

అది భాజపా వ్యాక్సిన్..నేను తీసుకోను: అఖిలేశ్

చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని