
తాజా వార్తలు
బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త: ప్రధాని హెచ్చరిక
దిల్లీ: దేశంలోని పలుచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతున్న వేళ రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేశారు. ఈ వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలని సీఎంలకు సూచించారు. సోమవారం రాష్ట్రాల సీఎంలతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మోదీ.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపైనా మాట్లాడారు. స్థానిక ప్రభుత్వ అధికారులు నీటి కొలనులు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ మార్కెట్లు, పౌల్ట్రీఫాంల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వశాఖ ఒక ప్రణాళిక రూపొందించిందని, ఇందులో జిల్లా కలెక్టర్లదే కీలక పాత్ర అన్నారు.
ఇప్పటికే బర్డ్‌ఫ్లూ వ్యాపించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారా జిల్లా కలెక్టర్లను మార్గదర్శనం చేయాలని సూచించారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం లేని రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పక్షుల్లో అనారోగ్య లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని, వాటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపాలన్నారు. తద్వారా సత్వరచర్యలు తీసుకొనేందుకు వీలుంటుందని చెప్పారు. అటవీ, ఆరోగ్య, పశుసంవద్ధక శాఖల మధ్య సరైన సమన్వయంతో ఈ సవాల్‌ను త్వరగా అధిగమించగలమని ప్రధాని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్రలలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..