సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా మోదీ 
close

తాజా వార్తలు

Published : 18/01/2021 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా మోదీ 

అహ్మదాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ప్రభాస్‌ పటాన్‌ పట్టణంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయ ట్రస్ట్‌కు ఇప్పటికే ట్రస్టీగా కొనసాగుతున్న మోదీని.. ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గత కొన్నేళ్ల పాటు ట్రస్టు ఛైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌ మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ అక్టోబర్‌లో మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆలయ ట్రస్టు 120వ సమావేశం సోమవారం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇందులో పాల్గొన్న ట్రస్టీలంతా కొత్త ఛైర్మన్‌గా మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ట్రస్టీ సెక్రటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. ఈ ట్రస్టులో ఇతర ట్రస్టీలుగా భాజపా నేత ఎల్‌కే ఆడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి..

‘దీదీ’ని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా: సువేందు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని