close

తాజా వార్తలు

Updated : 28/11/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవాగ్జిన్‌ పురోగతిపై మోదీ సమీక్ష

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ను సందర్శించి ‘కొవాగ్జిన్‌’ టీకా అభివృద్ధిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. కొవాగ్జిన్‌ టీకాపై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ‘కొవాగ్జిన్‌’ తాజా పరిస్థితిపై భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 

 ప్రధానికి స్వాగతం పలికిన అధికారులు
 అహ్మదాబాద్‌  నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్న ప్రధానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రధాని .. జినోమ్‌వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ సంస్థకు చేరుకున్నారు. 

 ఇదీ చదవండి..

‘కొవాగ్జిన్‌’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని