close

తాజా వార్తలు

Published : 28/01/2021 18:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాపై పోరులో సవాళ్లను అధిగమించాం: మోదీ  

దిల్లీ: కరోనాపై పోరాటంలో ఎదురైన సవాళ్లను అధిగమించి వైరస్‌ కట్టడి చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వర్చువల్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడికి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించామన్నారు. కేవలం 12 రోజుల్లోనే 23లక్షల మందికి కొవిడ్‌ టీకాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరికొద్ది నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్‌ ప్రపంచస్థాయిలో బాధ్యతలు తీసుకుందన్నారు. దాదాపు 150 దేశాలకు ఔషధాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో చాలా దేశాలు విమానాశ్రయాలు మూసివేసినా.. భారత్‌ మాత్రం లక్ష మందిని పైగా స్వదేశాలకు పంపిందన్నారు. 

‘‘కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌పై దారుణంగా ఉంటుందని గతేడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో అనేకమంది నిపుణులు చెప్పారు. కరోనా కేసుల సునామీ వస్తుందన్నారు. దాదాపు రెండు మిలియన్ల మరణాలు సంభవిస్తాయని చెప్పారు. కానీ దేశ ప్రజల భాగస్వామ్యంతో భారత్ చురుగ్గా ముందుకు కదిలింది. ఎక్కువ మంది ప్రాణాలును కాపాడటంలో విజయంతమైన దేశాల సరసన నిలిచింది. ప్రపంచ జనాభాలో 18శాతంగా ఉన్న భారతదేశం కొవిడ్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగింది’’ అని మోదీ తెలిపారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించాం. కేవలం 12 రోజుల్లోనే 2.3 మిలియన్ల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశాం. ప్రపంచ దేశాల్లోని ప్రజల ప్రాణాల్ని కాపాడటమే లక్ష్యంగా ఇతర దేశాలకూ వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నాం. భారత్‌ రెండు కరోనా టీకాలు తయారుచేసింది. త్వరలో భారత్‌ నుంచి మరిన్ని టీకాలు రానున్నాయి’’ అని తెలిపారు.

ఇదీ చదవండి..

వెజ్‌ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని