గురుద్వారాలో మోదీ పూజలు
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గురుద్వారాలో మోదీ పూజలు

దిల్లీ: 17వ శతాబ్దానికి చెందిన దిల్లీలోని ప్రముఖ గురుద్వారాలో ప్రధాని మోదీ శనివారం ఉదయం పూజలు చేశారు. సిక్కు గురువు గురు తేగ్‌ బహదూర్‌ 400వ ప్రకాశ్‌ పర్వ్‌ (జయంతి) సందర్భంగా ప్రధాని పురాతన సిస్‌ గంజ్‌ సాహెబ్‌ గురుద్వారాలో పూజలు నిర్వహించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేకుండానే ప్రధాని గురుద్వారాను సందర్శించినట్లు ప్రధానమంత్రి అధికార కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిజయజేశారు. ‘ఈ ప్రత్యేకమైన రోజున శ్రీ గురు తేగ్ బహదూర్ జీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దౌర్జన్యాలను, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన చూపించిన ధైర్యం, తెగువ.. అణగారిన ప్రజలకు చేసిన సేవతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు.  ఆయన చేసిన త్యాగాలు ఎంతో మందిలో స్ఫూర్తి, ప్రేరణను నింపాయి’ అని పేర్కొన్నారు.

గురు తేగ్‌ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్ సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని