న్యాయవాదుల హత్య: అదుపులో నిందితులు
close

తాజా వార్తలు

Published : 19/02/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయవాదుల హత్య: అదుపులో నిందితులు

పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, వసంతరావు, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులను ఇవాళ రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎ-1గా వెల్ది వసంతరావు, ఎ-2గా కుంట శ్రీనివాస్‌, ఎ-3గా అక్కపాక కుమార్‌ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

కుంట శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన తెరాస

న్యాయవాద దంపతుల హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన కుంట శ్రీనివాస్‌ను తెరాస సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం ఆయన మంథని మండల తెరాస అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని