రాళ్లు వేసిన వారిని చూశారా?
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాళ్లు వేసిన వారిని చూశారా?

చంద్రబాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తెదేపా నిర్వహించిన బహిరంగ సభలో రాళ్ల దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ ప్రాంతం నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ముగుస్తున్న సమయంలో కొందరు రాళ్ల దాడి చేశారు. ఈఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు ఉదయం తిరుపతిలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు వచ్చి నిన్నటి దాడి ఘటనపై భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. చంద్రబాబు వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. రాళ్లు వేసిన వారిని చూశారా? ఎటువైపు నుంచి వచ్చాయో గమనించారా?అని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ను తిరుపతి అర్బన్‌ పోలీసులు వీడియో తీశారు.

సీఈసీకి ఫిర్యాదు చేయనున్న ఎంపీలు

తిరుపతిలో నిన్న చంద్రబాబుపై ప్రచారం సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఆ పార్టీ ఎంపీలు తిరుపతి నుంచి దిల్లీ వెళ్లనున్నారు. ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ సాయంత్రం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. నిన్నటి రాళ్లదాడి ఘటనను సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలింగ్‌ను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరనున్నారు.

గవర్నర్‌ను సమయం కోరిన తెదేపా

తిరుపతిలో చంద్రబాబు వాహనంపై రాళ్లు విసిరిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఆ పార్టీ నేతలు గవర్నర్‌ను సమయం కోరారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి వ్యవహారాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదే విషయమై నిన్న రాత్రి వర్ల రామయ్య గవర్నర్‌కు లేఖ రాశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని