రామతీర్థంలో రాజకీయ వేడి 
close

తాజా వార్తలు

Updated : 02/01/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామతీర్థంలో రాజకీయ వేడి 

విజయనగరం: ఏపీ రాజకీయాలు ప్రస్తుతం విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. డిసెంబరు 29న రాముడి విగ్రహంపై దాడి జరగ్గా, 30వ తేదీన కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహం శిరచ్ఛేదంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం విమర్శలకు దిగడంతో ఒక్కసారిగా రాజకీయవేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెదేపా అధినేత చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలించనున్నారు.

చంద్రబాబు కంటే ముందే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ రామతీర్థం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల కార్యకర్తలు రామతీర్థానికి క్యూ కట్టారు. దీంతో విజయనగరం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.  మరో వైపు ఈకేసుకు సంబంధించి రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరిబాబు, రాంబాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో సంబంధం లేనివారిని అరెస్టు చేశారని వారి కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు తెదేపా నేతలు సిద్ధమయ్యారు.

భారీగా చేరుకుంటున్న పార్టీల శ్రేణులు

పలు రాజకీయ పార్టీల నాయకుల పర్యటనల నేపథ్యంలో తెదేపా, వైకాపా, భాజపా శ్రేణులు భారీగా రామతీర్థానికి చేరుకుంటున్నారు. రామతీర్థం బోడిగుండ దిగువన భాజపా దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో తెదేపా, వైకాపా నేతలు శిబిరాలను ఏర్పాటు చేశారు. 

ఇవీ చదవండి..
కోదండ రాముడి విగ్రహం ధ్వంసం

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యంTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని