close

తాజా వార్తలు

Updated : 19/07/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

#ప్రభాస్‌21: సర్ ప్రైజ్ వచ్చేసింది

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అందరి అంచనాలు అందుకునేలా... వీలైతే దాటేసేలా ఆ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ ప్రైజ్ ఇస్తామని శనివారం చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న కథానాయిక వివరాలను వెల్లడించింది. 

ప్రభాస్‌కు జోడిగా ఈ సినిమాలో దీపికా పదుకొణె  నటిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం  రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పాన్ ఇండియా’  సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందం ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.