ఏపీ సీఎస్‌కు ప్రవీణ్ ప్రకాశ్‌ లేఖ

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:39 IST

ఏపీ సీఎస్‌కు ప్రవీణ్ ప్రకాశ్‌ లేఖ

ఎస్‌ఈసీ లేఖపై స్పందించిన ప్రవీణ్

అమరావతి: తనపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాసిన లేఖపై సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్‌ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ సీఎస్‌కు లేఖ రాశారు. ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో ఎస్‌ఈసీ పేర్కొన్న విషయాన్ని ప్రవీణ్‌ ప్రకాశ్‌ తోసిపుచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ప్రభుత్వానికి నివేదించానని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా తాను ఎలా ప్రభావితం చేయగలనో ఎస్ఈసీ చెప్పాలని సీఎస్‌ను కోరారు.

ఎన్నికల సమయంలో 2006లో విశాఖ, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి తనను బదిలీ చేసిన మాట వాస్తవమేనని ప్రవీణ్‌ స్పష్టం చేశారు. అలాగే 2014, 2017 సాధారణ ఎన్నికల్లో పరిశీలకుడిగా తనను ఎన్నికల సంఘం నియమించిందని చెప్పారు. నిబంధనల మేరకే వ్యవహరించాను తప్ప పరిధి దాటలేదని.. తాను ఎవరినీ నియంత్రించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసుల అధికారులు నిబంధనల మేరకే విధులు నిర్వహిస్తారని.. జనవరి 25న ఎస్ఈసీ రాసిన లేఖకు మరుసటి రోజే సమాధానం ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సీఎస్ ద్వారా జరపాలని ఎస్ఈసీని కోరానని.. నేనెక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించానో ఇప్పటికీ అర్థంకావడం లేదన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం తనకు లేదని.. సీఎస్ సూచనల మేరకే తాను నడుచుకుంటున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తప్పించండి

ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌పై చర్యలు: నిమ్మగడ్డ
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని