‘నా గర్భంలోని శిశువును మాయం చేశారు’
close

తాజా వార్తలు

Published : 17/01/2021 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నా గర్భంలోని శిశువును మాయం చేశారు’

తిరుపతి ఆస్పత్రి సిబ్బందితో మహిళ వాగ్వాదం

తిరుపతి: కాన్పు కోసం వస్తే గర్భం రాలేదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారంటూ ఓ మహిళ వాగ్వాదానికి దిగిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మహిళ తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తాను గర్భవతినని.. తన గర్భంలోని శిశువును మాయం చేసి వైద్యులు అబద్ధమాడుతున్నారంటూ మహిళతో పాటు ఆమె బంధువులు ఆరోపించారు. దీనిపై స్పందించిన వైద్యులు.. ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలూ జరపలేదన్నారు. గాలిబుడగలను గర్భంగా భావించి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళకు నమ్మకం లేకపోతే ఏ ఆస్పత్రిలోనైనా పరీక్షలు చేసుకోవచ్చన్నారు. సిబ్బంది సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి..

వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్‌!!

ఉపఎన్నికలో లబ్ధికే భాజపా యత్నం: వెల్లంపల్లి



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని