థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంకండి: సుప్రీం కోర్టు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంకండి: సుప్రీం కోర్టు

పాన్‌ ఇండియా స్థాయిలో ఆక్సిజన్‌ పంపిణీ చేయాలని కేంద్రానికి సూచన


దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 థర్డ్‌ వేవ్‌ రానున్న  తరుణంలో సుప్రీం కోర్టు కీలక సూచనలు జారీచేసింది. దేశం అంతటా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది. థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌తో పోరాడటానికి పాన్ ఇండియా స్థాయిలో ఆక్సిజన్‌ అందించాలని కేంద్రానికి సూచించింది. ప్రజల్లో ఆక్సిజన్‌ కొరత పట్ల ఉన్న భయానికి తెర దించేలా బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ‘‘మనం థర్డ్‌ వేవ్‌కు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ బఫర్‌ స్టాక్‌ను సిద్ధంగా ఉంచవలసిన అవసరం ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. కరోనా థర్డ్‌ వేవ్‌ రాక ముందే ఆక్సిజన్‌ వినియోగం, నిల్వలపై ఆడిట్‌ జరిపాలని కేంద్రానికి సూచించింది. ఇదిలా ఉంటే.. దిల్లీలో గడిచిన 24 గంటల్లో 20,960 కరోనా కేసులు నమోదయ్యాయి. 311 మరణాలు సంభవించాయి. 19,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని