కర్ణాటక నుంచి మదనపల్లె రానున్న రాష్ట్రపతి
close

తాజా వార్తలు

Updated : 03/02/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్ణాటక నుంచి మదనపల్లె రానున్న రాష్ట్రపతి

పర్యటన వివరాలు వెల్లడించిన రాష్ట్రపతి భవన్‌ 

దిల్లీ: ఈ నెల 7న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అలాగే, సదుంలోని ‘పీపల్‌ గ్రోవ్‌’‌ పాఠశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 4 నుంచి 7 తేదీల వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తారని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం (గురువారం) దిల్లీ నుంచి బయల్దేరనున్న రాష్ట్రపతి కోవింద్‌ బెంగళూరు చేరుకుంటారు. ఫిబ్రవరి 5న యలహంకలో జరుగుతున్న ఎయిరో ఇండియా-2021 కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 6వ తేదీన  కొడగు జిల్లాలో పర్యటించనున్న కోవింద్‌.. జనరల్‌ తిమ్మయ్య పూర్వీకుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. 7న బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఏపీలో అదేరోజు పర్యటన పూర్తిచేసుకొని దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏపీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. 

ఇదీ చదవండి..

కన్నీళ్లు పెట్టుకున్నారు.. కాదనలేకపోతున్నా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని