బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌కు అస్వస్థత 
close

తాజా వార్తలు

Published : 18/02/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌కు అస్వస్థత 

లండన్‌: బ్రిటన్‌ రాజకుమారుడు ఫిలిప్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్‌లోని కింగ్‌ ఎడ్వర్డ్‌ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం చేరి చికిత్స తీసుకుంటున్నారని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 99 ఏళ్లు. క్వీన్‌ ఎలిజిబెత్‌ -II భర్త అయిన ఫిలిప్‌.. తన వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే పరిశీలనలో ఉండి విశ్రాంతి తీసుకుంటారని ప్యాలెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌తో బ్రిటన్‌లో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాణితో కలిసి ఫిలిప్‌ వెస్ట్‌ లండన్‌లోని విండ్సోర్‌ రాజభవనంలోనే ఉంటున్నారు. జనవరి నెలలో క్వీన్‌ ఎలిజిబెత్‌, ఫిలిప్‌ తొలి డోసు కొవిడ్‌ టీకాను తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని