close

తాజా వార్తలు

Published : 21/07/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పుడు మూగబోయా.. తర్వాత చెబుతూనే ఉన్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియాంక చోప్రా - నిక్‌ జొనాస్‌ ప్రేమక కథ గురించి మనందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. తర్వాత అడపాదడపా తమ దాంపత్యం ఎలా సాగుతుందనే వివరాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. అప్పుడప్పుడూ ప్రేమ సంగతులూ చెబుతూ వచ్చారు. అయితే వీరిద్దరి మధ్య పెళ్లి టాపిక్‌ ఎప్పుడొచ్చింది... ఎవరు ముందు పెళ్లి గురించి మాట్లాడారు... అప్పుడు వచ్చిన స్పందనేంటి అనే వివరాలు పెద్దగా తెలియవు. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది.

ప్రియాంక చోప్రా జన్మదినం సందర్భంగా ఆమె చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆ వివరాలు తెలిశాయి. అది చదివాక... ప్రేమను ఇంత బాగా వ్యక్తపరొచ్చా అని మీకు అనిపిస్తుంది. ‘నువ్వు పెళ్లి గురించి చెప్పినప్పుడు ఆ క్షణాన నా నోట మాట రాలేదు... ఆ తర్వాత ప్రతి క్షణం నేను నీకు ‘యస్‌’ చెబుతూనే ఉన్నాను’ అంటూ ప్రియాంక ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. అయితే పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయం ఎందుకు చెప్పింది అనేదేగా మీ డౌట్‌. ఎందుకంటే రెండేళ్ల క్రితం ప్రియాంక జన్మదినం తర్వాతి రోజున నిక్‌ జొనాస్‌ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. అందుకే ప్రియాంక ఈ రోజు ఆ ఇన్‌స్టా పోస్టు చేసింది. 

మరి ప్రియాంక ఇంత ప్రేమగా రాసిన పోస్టుకు భర్త నిక్‌ జొనాస్‌ స్పందించంకుండా ఉంటాడా?... ‘నాకు యస్‌ చెప్పినందుకు ధన్యవాదాలు... ఐ లవ్‌ య్యూ బ్యూటిఫుల్‌’ అని సమాధానమిచ్చాడు. ఇదన్నమాట... నిక్యాంక పెళ్లికి ముందు జరిగిన సంఘటన. ‘ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలైన అమ్మాయిని నేనే’ అంటూ ప్రియాంక తన పోస్టులో ఇంకా ఏం రాసిందో కింద చూడొచ్చు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన