close

తాజా వార్తలు

Published : 23/05/2020 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా సంక్షోభం: వారి జీతాలు ఇచ్చేయండి!

నిర్మాతలకు ఐఎమ్‌పీపీఏ సూచన

ముంబయి: పెండింగ్‌లో ఉన్న తమ ఉద్యోగుల జీతాల్ని చెల్లించమని ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐఎమ్‌పీపీఏ) నిర్మాతలకు సూచించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద పనిచేస్తున్న రోజువారి కూలీలతోపాటు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టుల జీతాలు కూడా చెల్లించమని పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సినీ కార్మికులు, కొందరు కళాకారులు ఉపాధి కోల్పోయారు. వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ఐఎమ్‌పీపీఏ ప్రకటన విడుదల చేసింది.

‘రోజు వారి కూలీలు, టెక్నీషియన్లు, ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. మన సినిమాల కోసం పనిచేసిన వారికి పూర్తి జీతాలు ఇవ్వకపోవడం, ఆపై ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల వారి పరిస్థితి కష్టంగా మారింది. నిర్మాతలు కూడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి.. మీ సినిమా కోసం, ఆఫీసులో పనిచేసిన కూలీలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు బకాయి ఉన్న జీతాలు చెల్లించండి. కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకునే పరిస్థితిని వారికి కల్పించండి. వీలైనంత త్వరగా జీతాల్ని ఇచ్చేయండి’ అని సంఘం సూచించింది.

వేల మంది సినీ కార్మికులు తమ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు విరాళాలతో వారిని ఆదుకున్నారు. సల్మాన్‌ బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సాయం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన