close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పబ్‌జీ కోసం ₹16 లక్షలు ఖర్చు పెట్టేశాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్ వినియోగిస్తున్న యువతలో పబ్‌జీ గేమ్ ఆడని వారు చాలా తక్కువ మందనే చెప్పాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బాగా ప్రాచుర్యం పొందిన వాటిల్లో పబ్‌జీ ఒకటి. హమ్మయ్యా.. ఇవాళ చికెన్‌ డిన్నర్‌ సాధించానోచ్చ్‌.. అంటే ఓహో కోడికూర తిన్నాడేమో అనుకుంటారు తెలియనివాళ్లు.. అదే పబ్‌జీ ఆడేవారికి తేలిగ్గా అర్థమై కంగ్రాట్స్‌ చెప్పుకుంటారు... అయితే గేమ్‌ వ్యసనంగా మారితే మాత్రం ఇటు ఆరోగ్యానికే కాకుండా అటు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గేమ్‌ కోసం లక్షలు ఖర్చు చేసిన సంఘటనే పంజాబ్‌లో జరిగింది. ఓ 17 ఏళ్ల యువకుడు పబ్‌జీ ఆట కోసం తల్లిదండ్రులకు తెలియకుండా భారీ మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడికి పబ్‌జీ అంటే మహా ఇష్టం. ఒకసారి ఆటలోకి దిగాడంటే ప్రపంచాన్నే మరిచిపోతాడు. వ్యసనంతో గేమ్‌లోని కాస్మొటిక్‌ వస్తువులు, ఆయుధాలు, పాస్‌ల కోసం తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా నుంచి ఖర్చు పెట్టాడు. దాదాపు రూ.16 లక్షల వరకు పబ్‌జీ గేమ్‌ కోసం వాడేశాడు. ఇదంతా యువకుడి తండ్రి వైద్యం కోసం దాచి పెట్టిన సొమ్ము. పాపం ఈ విషయంపై అవగాహన లేని తల్లిదండ్రులు తమ కొడుకు ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నాడని భావించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇప్పుడంతా ఆన్‌లైన్‌ క్లాస్‌ల హవా. దానిని సాకుగా చూపి తల్లిదండ్రులకే టోకరా వేశాడు. ఒకసారి స్మార్ట్‌ఫోన్‌లో లావాదేవీ జరిపిన తర్వాత బ్యాంకు, కార్డు వివరాలన్నీ నిక్షిప్తం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఆ యువకుడికి అనుకూలంగా మారింది. ఈ రూ.16లక్షల లావాదేవీలన్నీ కేవలం ఒక నెల వ్యవధిలోనే జరపడం గమనార్హం.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని