close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/06/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కిరాణా దుకాణాల్లో కొందాం

లాక్‌డౌన్‌ తెచ్చిన మార్పిది  
డెలాయిట్‌ నివేదిక

అమ్మా, నాన్నా, పిల్లలు కలిసి మాల్‌కు వెళ్లడం.. ఏసీ సూపర్‌మార్కెట్లో అవసరం ఉన్నవీ, లేనివీ కొనుగోలు చేయడం.. అక్కడే హోటల్‌లో భోంచేసి ఇంటికి రావడం.. ఇదీ కొవిడ్‌-19కు ముందు పట్టణాలు, నగరాల్లో సరకుల కొనుగోలు తీరు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో ఇదంతా మారిపోయింది..
అధిక శాతం మంది వినియోగదార్లు దూర ప్రాంతాలకు వెళ్లి సరకులు కొనుగోలు చేయడం కంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణాలవైపే మొగ్గు చూపుతున్నట్లు డెలాయిట్‌ సర్వే వెల్లడించింది. ‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ ది కన్జూమర్‌ ట్రాకర్‌’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఇ-మెయిల్‌ ద్వారా అందించిన ప్రశ్నావళికి 18 ఏళ్లు నిండిన సుమారు 1,000 మంది స్పందించారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌ వంటి 13 దేశాల్లో ఇలాంటి సర్వేనే డెలాయిట్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ 19 నుంచి మే 16 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ నుంచి వచ్చిన స్పందనలు ఇలా ఉన్నాయి.

* చాలా మంది వినియోగదార్లు ఇళ్లలో సరకులు నిల్వ ఉంచుకోడానికి ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉండే కిరాణా దుకాణాల నుంచి అప్పటికప్పుడు తెచ్చుకొనేందుకే ఇష్టపడుతున్నారు.
* గత 6 వారాల్లో వ్యయ విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందని 55 శాతం మంది వినియోగదార్లు వెల్లడించారు. కిరాణా వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నామన్నారు. రోజు వారీ ఇంటి సామాన్లపై ఖర్చు చేస్తామని 52 శాతం మంది తెలిపారు.
* లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా దుకాణాలే సరకులు అందించాయి. మనకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటున్నందున, అక్కడే కొంటామని 72 శాతం మంది వెల్లడించారు.
* సంక్షోభం సమయంలో బాగా స్పందించిన బ్రాండ్లను కొనుగోలు చేస్తామని 64 శాతం మంది పేర్కొన్నారు.
సొంత వాహనం కొంటాం: 79 శాతం మంది
* ప్రయాణాలకొస్తే అధిక శాతం మంది ప్రజా రవాణాను పరిమితం చేసుకుంటామన్నారు. గుంపుగా కలిసి ప్రయాణం చేసేందుకు దూరంగా ఉంటామని 70 శాతం మంది తెలిపారు. 79 శాతం మంది సొంతంగా వాహనం సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు.
* ‘సవాళ్ల సమయంలో వినియోగదార్ల ప్రవర్తన, కొనుగోలు సరళి ఎలా ఉంటుందనేది ఈ సర్వేతో తెలిసింది. నిర్ణయాలు తీసుకోవడంలో వారి ఆందోళనను ఇది ప్రతిబింబించింది. విక్రయాలు, మార్కెటింగ్‌ విషయంలో ఉత్పత్తి సంస్థలు కూడా కొత్త వ్యూహాలను రచించడానికి ఇది తోడ్పడుతుంద’ని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌, కన్జూమర్‌ ఇండస్ట్రీ లీడర్‌ అనిల్‌ తాల్రేజా వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.