close

తాజా వార్తలు

Updated : 28/01/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పుష్ప’రాజ్‌ వచ్చేస్తున్నాడోచ్‌..!

విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం  
 

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ - సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. రిలీజ్‌డేట్‌ను తెలియజేస్తూ బన్నీ ట్విటర్‌ వేదికగా.. ‘పుష్ప’ స్పెషల్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బన్నీ స్మగ్లర్ల టీమ్‌కు నాయకుడిగా ఊరమాస్‌ గెటప్‌లో కనిపించారు.

‘2021 ఆగస్టు 13వ తేదీన ‘పుష్ప’ థియేటర్లలో విడుదల కానుంది.  ఈ ఏడాది థియేటర్లలో మీ అందరినీ కలవడం కోసం నేను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను. నేను, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌లు  మరోసారి చరిత్ర పునరావృతం చేస్తామని ఆశిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు.

పాన్‌ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని  మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

ఇదీ చదవండి

స్టార్‌హీరో పెళ్లిపై నటి వైరల్‌ కామెంట్‌Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని