నేను ఎక్కడికీ పారిపోలేదు: పుట్టా మధు
close

తాజా వార్తలు

Updated : 20/02/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను ఎక్కడికీ పారిపోలేదు: పుట్టా మధు

మంథని: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసుల కన్నా మీడియానే అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. మీడియా చేస్తున్న అసత్య ప్రచారానికి కాంగ్రెస్‌ నేతలు తోడయ్యారని విమర్శించారు. మంథనిలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేయాల్సిన దర్యాప్తును ఆ సంస్థలే చేస్తున్నట్లుగా ఉందన్నారు. న్యాయవాద దంపతుల హత్య జరిగిన తర్వాత తాను మంథనిలో ఉండడం లేదని.. ముఖం చాటేశానని కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల అపాయింట్‌మెంట్లు నేను అడగలేదు. నేను ఎవరికోసం ఎదురుచూడలేదు. హత్య జరిగిన రోజు నుంచి ఇవాళ్టి వరకు మంథని నియోజకవర్గంలోనే ఉన్నా. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను. కాంగ్రెస్‌ నేతలకు తొత్తుగా మారి అమ్ముడుపోయిన కొన్ని మీడియా సంస్థలు, టీవీ ఛానళ్లు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. ఆ మీడియా సంస్థలే నన్ను లోపలికి పంపించేందుకు తాపత్రయపడుతున్నాయి. నా కుటుంబం, నాపై ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదు. నేను మోసగాడ్ని కాదు. నేను, నా కుటుంబం ప్రజల కోసమే జీవితాలను అంకితం చేశాం. ఈ హత్యకు సంబంధించి పోలీసుల విచారణ అనంతరం హైదరాబాదులో అన్ని ఆధారాలతో మీడియాతో మాట్లాడతాను’’ అని పుట్ట మధు తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని