జంతర్‌ మంతర్‌ల క్యూఆర్‌ కోడ్‌
close

తాజా వార్తలు

Updated : 26/02/2021 13:38 IST

జంతర్‌ మంతర్‌ల క్యూఆర్‌ కోడ్‌

నిండా ముంచుతున్న సైబర్‌ నేరగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నయా మోసాలకు పాల్పడుతున్నారు. వస్తువుల కొనుగోలు, విక్రయాల పేరుతో అమాయకుల డబ్బు దోచుకుంటున్నారు. సెల్‌ఫోన్‌కు లింక్‌ పంపించి మోసాలకు పాల్పడేవారు ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌ పంపి నిండా ముంచుతున్నారు. ఈ తరహా మోసాలు గతేడాది నుంచి ఎక్కువ జరుగుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసుల నివేదికలో తేలింది.  ఎవరైనా ఓ వస్తువును ఓఎల్‌ఎక్స్‌ లేదా ఇతర వెబ్‌సైట్లలో విక్రయానికి పెడితే.. ఆ వస్తువు కొంటామని సైబర్‌ నేరగాడు సంప్రదిస్తాడు. వస్తువు ధర నిర్ణయించుకున్న తర్వాత నగదు చెల్లింపుపై చర్చిస్తాడు. డబ్బును వాలెట్‌ ద్వారా పంపిస్తున్నట్లు చెప్పి దానికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తాడు. వినియోగదారుడు ఆ కోడ్‌ను స్కాన్‌ చేయగానే అతడి ఖాతాలోనుంచి నగదు మాయమవుతుంది. 

సైబర్‌ మోసగాడు పంపించే క్యూఆర్‌ కోడ్‌లో నగదు పంపడానికి బదులు తీసుకోవడం అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఇది గమనించని వినియోగదారుడు ఆ కోడ్‌ను స్కాన్‌ చేయగానే అతడి ఖాతాలో ఉన్న డబ్బు మాయమవుతుంది. గతేడాది సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోనే ఈ తరహా మోసాల వల్ల రూ.1.70 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో వస్తువుల విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం ఉంచుతున్నారు. వాటిని చూసి ఎవరైనా సంప్రదిస్తే వారి ఖాతాలో డబ్బు మాయం చేస్తున్నారు.

కొంత మంది సైబర్‌ నేరగాళ్లయితే పోలీసు, సైనిక, నౌకాదళ అధికారులమంటూ నమ్మిస్తున్నారు. యూనిఫామ్‌లు వేసుకొని ఫొటోలు దిగి వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆర్మీ, నేవీ అధికారులమంటే ప్రజలు వెంటనే నమ్మి బుట్టలో పడిపోతారని కుట్రలు పన్నుతున్నారు. ఎక్కువగా రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే క్యూఆర్‌ కోడ్‌లకు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి వస్తే చెల్లింపు కోసమా? స్వీకరించడానికా? అనే విషయాన్ని గమనించాలని పోలీసులు పేర్కొంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని