ఎన్నికల్లో పోటీకి సినీ నటి రాధిక ఆసక్తి! 
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 13:05 IST

ఎన్నికల్లో పోటీకి సినీ నటి రాధిక ఆసక్తి! 

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ సినీనటి రాధిక ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె కోసం రెండు నియోజకవర్గాలు పరిశీలిస్తున్నట్టు ఏఐఎస్‌ఎంకే వ్యవస్థాపకుడు, ఆమె భర్త శరత్‌ కుమార్‌ తెలిపారు. ఆమె కోసం తెన్‌కాశీ, వేలచెర్రి నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. బుధవారం పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ.. శరత్‌ కుమార్‌కు భయం లేదని, ఆయన కేవలం ఆప్యాయతకే తలవంచుతారన్నారు. ఈ ఎన్నికలతో మార్పు వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. తమ నేత శరత్‌ కుమార్‌ చెబితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాధిక వెల్లడించారు. 

2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఎస్‌ఎంకే నుంచి శరత్‌ కుమార్‌ తిరుచెండూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. ఆయన గెలుపుకోసం రాధిక చాలా చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ఆ ఎన్నికల్లో శరత్‌కుమార్‌ ఓటమిపాలయ్యారు.

మరోవైపు, తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పొత్తులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐఎస్‌ఎంకే, ఐజేకే పార్టీలు ఇటీవల కూటమిగా ఏర్పడగా.. కమల్‌హాసన్‌ స్థాపించిన ఎంఎన్‌ఎంతో కలిసి ఎన్నికల బరిలో నిలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు శరత్‌ కుమార్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన కమల్‌ను కలిసి చర్చించారు. తృతీయ కూటమి దిశగా కమల్‌ కూడా పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మూడు పార్టీల కూటమిపై ఇంకా అధికారిక ప్రకటన రాకముందే తమ సీఎం అభ్యర్థి కమల్‌ హాసనేనని శరత్‌ కుమార్‌ తాజాగా పుదుకొట్టైలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం విశేషం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని